అంబేద్కర్ భవనం అభివృద్ధి: మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు నేతల డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కుప్పం

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని సామగుట్టపల్లి వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ భవనాన్ని పూర్తి స్థాయిలో ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని ఎంఆర్పీఎస్, బహుజన సేన నాయకులు డిమాండ్ చేశారు. భవనం పరిసరాల్లోని ముళ్లకంపలను తొలగించడంతో పాటు విద్యుత్ సౌకర్యం, కుర్చీలు, టేబుల్ వంటి కనీస వసతులు కల్పించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రాజుకు మాజీ అధ్యక్షుడు ఎంపీ ప్రకాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ మహేష్ వినతిపత్రం సమర్పించారు.