నగరిలో అస్తవ్యస్తంగా మారిన వార్డుల విభజన ప్రక్రియ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
స్పష్టత లేకుండా చేపట్టిన వార్డుల విభజన ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉందని, ఈ విధానం ఆమోదయోగ్యం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్‌ను కలిసి సమస్యను వివరించారు. 29 వార్డులను 40 వార్డులుగా విభజించే ప్రక్రియపై అభ్యంతర పత్రాన్ని అందజేశారు. వార్డు సరిహద్దులు, డోర్ నంబర్లపై స్పష్టత లేదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.