కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ తరఫున పోటీ చేయాలని జ్ఞానేష్ కుమార్ కోరారంటూ థామ్సన్ వెల్లడించారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకే ఆయనను సీఈసీగా కూర్చోబెట్టారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషన్ నిర్ణయాలలో భేదాలు సహజమేనని, అన్నీ ఏకగ్రీవంగానే ఆమోదించబడ్డాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.