వైద్య సిబ్బంది సమ్మె కలకలం: విజయనగరం ఆసుపత్రుల్లో తీవ్ర ఇబ్బందులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె ప్రభావంతో విజయనగరం జీజీహెచ్, ఘోషా ఆసుపత్రుల్లో రోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని సూపరింటెండెంట్ అల్లు పద్మజ వెల్లడించారు. సమ్మె కారణంగా వార్డు బాయ్స్ కొరత ఏర్పడటంతో రోగులను వారి బంధువులే వీల్ఛైర్లపై పరీక్షలకు తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సులు విధులకు హాజరుకాకపోవడంతో నర్సింగ్ విద్యార్థినులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆసుపత్రి ఇన్ఛార్జి పర్యవేక్షకుడు సత్యశేఖర్ తెలిపారు.