మహాకాళి సినిమా అప్డేట్: ఐగిరి నందిని ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మహాకాళి చిత్రానికి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించినట్లు సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలోని ఐగిరి నందిని అనే పవర్ ఫుల్ తొలి పాటను నవంబర్ 4న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్ లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.