విద్యార్థులకు ఈ నెల 29న ఉచిత కంటి పరీక్షలు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 29వ తేదీన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు క్లబ్ పిఆర్ఓ ఎం.ఎ. పాషా తెలిపారు. కంటి చూపు మందగించిన విద్యార్థులకు వైద్యులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిపి, ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయనున్నారు. ఈ సదావకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.