గోస్తాని వరద బీభత్సం: నీట మునిగిన నత్త రామేశ్వరాలయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: West Godavari

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో గోస్తాని డ్రైన్ ఉగ్రరూపం దాల్చడంతో ఎనిమిది గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరిందని స్థానికులు తెలిపారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డ్రైన్ పొంగిపొర్లడంతో నత్త రామేశ్వరంలోని శ్రీ రామేశ్వరస్వామి వారి దేవస్థానం నీట మునిగిందని వారు వెల్లడించారు. ఆలయం ఆవరణలోకి నీరు చేరడంతో భక్తులు గుడిలోకి వెళ్లలేని దుస్థితి నెలకొనగా పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.