సరుబుజ్జిలి మండలంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. జడ్పీటీసీ కూటమి అభ్యర్థి సింగుపురం దివ్య, ఎంపీటీసీ కిల్లి ఉమాదేవి ఆధ్వర్యంలో పురుషోత్తపురం, అలమాజిపేట, ఫకీర్ సాహెబ్ పేట గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకొని సమస్యలు తెలుసుకుంటూ కూటమి విజయానికి మద్దతు కోరారు.