కోర్టు ధిక్కరణ కేసులో భోగాపురం మాజీ తహసీల్దార్‌కు జరిమానా
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
కోర్టు ధిక్కరణ కేసులో నాటి భోగాపురం తహసీల్దార్ ఎం.రమణమ్మకు రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఖర్చుల కింద పిటిషనర్‌కు మరో రూ.10 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. సొమ్మును జమ చేయడంలో విఫలమైతే వారం రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. రమణమ్మ వయసు 61 ఏళ్లు, మహిళ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెపట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల ఈ తీర్పు వెలువరించారు.