సెప్టెంబర్ 10, 11న ఏపీ కలెక్టర్ల కీలక సదస్సు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: గుంటూరు

ఏపీలో పరిపాలనను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో వెలగపూడి సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు, సూపర్ సిక్స్ పథకాల అమలు, ఈ-గవర్నెన్స్ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను సాధించడం, ప్రభుత్వ సేవల నాణ్యతను పెంచడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.