భక్తిశ్రద్ధలతో పదహారేళ్ల క్రేజీ యూత్ అన్నప్రసాద వితరణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మెయిన్రోడ్లో గణనాథుని ఆశీస్సులతో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో 18వ సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వరుని తొలి పూజల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రసాదం స్వీకరించారు. గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల గణేష్ కుమార్, భరత్ కుమార్, కారణం వెంకటసుబ్బయ్య, రామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.