పురుషుల గర్భనిరోధక మార్గాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక బ్లూప్రింట్
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
పురుషుల కోసం సరికొత్త గర్భనిరోధక పద్ధతులను అభివృద్ధి చేసే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ఒక కీలక బ్లూప్రింట్‌ను విడుదల చేసినట్లు నిపుణులు తెలిపారు. కండోమ్‌లు మరియు వాసెక్టమీకి భిన్నంగా రోజువారీ మాత్రలు, జెల్స్, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్లు వంటి వినూత్న మార్గాలను తీసుకురావడానికి ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సురక్షితమైన, సమర్థవంతమైన పురుష గర్భనిరోధక మందుల తయారీకి పరిశోధకులకు ఇవి ప్రామాణికంగా నిలుస్తాయని వెల్లడించారు.