గుంటూరు బాపట్ల జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలతో నిలిచిన జనజీవనం
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గుంటూరు, బాపట్ల జిల్లాలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరంలో వాహనాలు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అర్ధరాత్రి రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.