ఢిల్లీలో విషాదం: ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు బాలిక ఆత్మహత్య

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని షహ్దారాలో 13 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు మందలించగా, మనస్తాపం చెందిన బాలిక గదిలోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.