కరేబియన్ క్రికెట్ పతనానికి ఐసీసీ నిర్ణయమే కారణమంటూ క్రిస్ డెహ్రింగ్ ధ్వజం
రిపోర్టర్: నరేష్
స్థలం: Caribbean
భారత జట్ల పర్యటనల ద్వారా వస్తున్న భారీ ఆదాయంలో ఆతిథ్య దేశానికే వంద శాతం దక్కేలా ఉన్న రెవెన్యూ మోడల్‌పై క్రికెట్ వెస్టిండీస్ సీఈవో క్రిస్ డెహ్రింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజ్డెన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, 1997లో అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న ఒకే ఒక నిర్ణయం కరేబియన్ క్రికెట్ పతనానికి నాంది పలికిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టూరింగ్ ఫీజు రద్దు వల్ల తమ ప్రధాన ఆదాయ వనరును కోల్పోయామని విమర్శించారు.