మౌలాలి వద్ద ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై మౌలాలి వద్ద విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. లోకోపైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సాంకేతిక లోపం వల్లే తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్ధారించారు. రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం కలిగింది.