'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు': అధికారుల స్పష్టమైన ఆదేశాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Kadapa
కడప జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి విగ్రహాల తయారీ ఉండాలని వారు స్పష్టం చేశారు. పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.