ప్రిన్సెస్ డయానా వివాదంపై స్పందించిన కింగ్ చార్లెస్
రిపోర్టర్: సురేష్
స్థలం: World
ప్రిన్సెస్ డయానా మరణంపై ఆమె సోదరుడు చార్లెస్ స్పెన్సర్ తన రాబోయే పుస్తకం స్వా సాంగ్ డయానా మై సిస్టర్ లో చేసిన సంచలన ఆరోపణలపై బ్రిటన్ కింగ్ చార్లెస్ స్పందించారు. డయానా మరణం తర్వాత తమ మధ్య జరిగినట్లు చెబుతున్న సంభాషణలు, వ్యాఖ్యలపై బకింగ్‌హామ్ ప్యాలెస్ అరుదైన ప్రకటన విడుదల చేసింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడం రాజ కుటుంబంలో చర్చనీయాంశమైంది.