ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నిర్లక్ష్యం
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ లోపలికి ఆర్టీసీ బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎంసీపీఐయూ నాయకులు మాట్లాడుతూ రోడ్డుపైనే బస్సులు ఆపుతుండటంతో పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆసిఫాబాద్ డిపో మేనేజర్ మరియు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి, తగిన చర్యలు తీసుకుని బస్టాండ్ లోపలికి బస్సులు వెళ్లేలా చూడాలని డిమాండ్ చేశారు.