భారతీయ వ్యాపార వాతావరణంపై ప్రపంచ దేశాల ప్రశంసలు

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

భారతదేశ వ్యాపార వాతావరణం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో దూసుకుపోతోందని బీజేపీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నూతన పెట్టుబడులు పెరుగుతుండటంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతోందని వెల్లడించింది. సుమారు నలభైకి పైగా మార్కెట్లలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని, గత నాలుగు సంవత్సరాలుగా గ్లోబల్ టాప్ మూడు స్థానాలను నిలబెట్టుకుంటూ ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొంటోందని వివరించింది. దేశ వ్యాపార వాతావరణం మెరుగ్గా ఉందని వ్యాపార వర్గాలు కొనియాడుతున్నాయి.