ఖమ్మం రోటరీ నగర్ పర్ణశాల వద్ద భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రోటరీ నగర్ పర్ణశాల వద్ద దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి సంబరాలు నిర్వహించారు. నవరాత్రుల చివరి రోజు విజయదశమి సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తమ కోరికలను కాగితాలపై రాసి జమ్మిచెట్టుకు సమర్పిస్తూ, అవి నెరవేరాలని ప్రార్థించారు. భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.