2027లో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర 2.0!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుంటూరు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 'పాదయాత్ర 2.0' నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.