ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు ఎనిమిదో తరగతి విద్యార్థులు అక్టోబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 15న ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం లభిస్తుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి.