జన్వాడ ఫామ్ హౌస్ పై కొనసాగుతున్న ఉత్కంఠ మరియు ఆస్తి వివాదం

రిపోర్టర్: కృష్ణ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ నేతలు పరిశీలించేందుకు వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది బీఆర్ఎస్ నేత కేటీఆర్ అక్రమ ఆస్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, అది తన స్వార్జితమని అసలైన యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు కేవలం లీజుకు మాత్రమే ఇచ్చానని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన తేల్చిచెప్పడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రేపుతోంది.