అధికారి టేబుల్‌పై వీధి కుక్కలను వదిలి యువసేన నిరసన
రిపోర్టర్: హరి
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాద్ నగర్ పంచాయతీ కార్యాలయంలో వీధి కుక్కల సమస్యను పట్టించుకోని అధికారి తీరుపై యువసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు సంచుల్లో వీధి కుక్కలను తెచ్చి చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భమ్రే టేబుల్‌పై వదిలారు. గత ఆరు నెలలుగా వీధి కుక్కల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే ఈ విధంగా నిరసన తెలపాల్సి వచ్చిందని, ఎనిమిది రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే కార్యాలయంలోకి మరిన్ని కుక్కలను వదులుతామని హెచ్చరించారు.