దుంపేటలో బస్టాండ్ దుస్థితి: ప్రయాణికులకు బదులుగా బైకులకు ఆశ్రయంగా షెల్టర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: కథలాపూర్
ప్రయాణికుల కోసం ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ కాస్త నేడు బైక్ పార్కింగ్‌గా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. బస్టాండ్ లో ద్విచక్ర వాహనాలు నిలపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.