సిద్దిపేటలో గణేశుడికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించిన వానరం
రిపోర్టర్: వెంకట్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట కస్తూర్బా బాలికల విద్యాలయంలో గణేశ్ నవరాత్రి ముగింపు వేడుకల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విద్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చిన ఒక వానరం సుమారు పది నిమిషాల పాటు అక్కడే కూర్చుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించింది. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన విద్యార్థినులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆ వానరం అక్కడినుంచి వెళ్లిపోగా, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినులు వినాయక విగ్రహాన్ని ఘనంగా నిమజ్జనం చేశారు.