ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ను ఢీకొన్న ట్రక్ కు ఆరుగురు దుర్మరణం
రిపోర్టర్: సునీల్
స్థలం: ఖుషీనగర్
ప్రదేశ్ లోని ఖుషీనగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఏఎస్పీ సిద్ధార్థ వర్మ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న మారుతి ఓమ్నీ వ్యాన్, ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గోరఖ్ పూర్ మెడికల్ కాలేజీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.