తిరుపతి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: సునీల్ స్థలం: తిరుపతి

తిరుపతి ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తుండగా, డ్రోన్ కెమెరాలతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది.