అచ్యుతాపురం సెజ్‌లో మాఫియా ముఠాల అరాచకాలు!

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. నాయకుల సహకారంతో గ్రావెల్‌ తవ్వకాలు, రసాయన వ్యర్థాల అక్రమ నిల్వలు, గంజాయి విక్రయాలు, బెదిరింపులు హెచ్చిపోయాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా సాగుతున్న ఈ అక్రమాలపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దొంగల ముఠాలు, కిలేడీల బెదిరింపులతో సెజ్‌ పరిసర ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.