ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
రిపోర్టర్: సురేష్
స్థలం: राजన్న సిరిసిల్ల
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 165 దరఖాస్తులు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.