ఖైరతాబాద్‌లో వైభవంగా పంచముఖ సంకటహర మహాగణపతి తొలి పూజ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్‌లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ తెలిపారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.