బాసరలో గోదావరి పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయాలి

రిపోర్టర్: హరి స్థలం: నిర్మల్

బాసరలో గోదావరి పుష్కరాల పనులను అన్ని శాఖల సమన్వయంతో గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. గురువారం ఆలయ ఈవో కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికతను వినియోగించాలని, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపించకూడదని హెచ్చరించారు.