పలాస డబ్బారు బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారి ప్రయాణికులు అప్రమత్తం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్నాద్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మందస–హరిపురం మార్గంలోని డబ్బారు బ్రిడ్జి వద్ద రోడ్డు దెబ్బతిన్నది. బ్రిడ్జి పక్కన నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని పరిశీలించిన జనసేన నేతలు సంతోష్ కుమార్ పండా, సవర శివ, బతకల భాస్కరరావు తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.