'ధర పెంచితే రైడ్ వస్తుంది': రాపిడో సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించిన సీసీపీఏ
రిపోర్టర్: సురేష్
స్థలం: భారతదేశం
వినియోగదారులను తప్పుదారి పట్టించేలా డార్క్ ప్యాటర్న్స్ మరియు కన్ఫర్మ్ షేమింగ్ పద్ధతులను అవలంబించిన రాపిడో మాతృ సంస్థ రోప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. అదనపు రుసుము చెల్లించాలంటూ వినియోగదారులపై ఒత్తిడి తెచ్చినందుకు గాను రాపిడో సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ధర పెంచితేనే రైడ్ కన్ఫర్మ్ అవుతుందనే తప్పుడు విధానాలపై సీసీపీఏ విచారణ జరిపి ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.