తెలుగులో మాట్లాడుకుంటూ కివీస్పై విజయం సాధించిన తిలక్, నితీశ్

రిపోర్టర్: సురేష్ స్థలం: క్రైస్ట్‌చర్చ్

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో జట్టును విజయం సాధించేలా చేశారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్లో క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో ఉన్న ఇద్దరు తెలుగు ఆటగాళ్లు స్థానిక యాసలో మాట్లాడుకున్న మాటలు మైక్ స్టంప్లో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.