చుంచుపల్లిలో వాలీబాల్ ఎంపికలు పూర్తి: రాష్ట్రస్థాయికి దరి క్రీడాకారిణులు ఎంపిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చుంచుపల్లి
బెల్లంపల్లి వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల కోసం ఉమ్మడి జిల్లా అండర్-17 బాలికల జట్టు ఎంపికలు చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ ఉన్నత పాఠశాల మైదానంలో ఉత్సాహంగా ముగిశాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబు సింగ్ తెలిపారు. ఈ ట్రయల్స్ లో నలుమూలల నుండి సుమారు 140 మంది క్రీడాకారిణులు హాజరై తమ ప్రతిభను చాటగా, అత్యుత్తమంగా రాణించిన 14 మంది బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.