క్యాట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
ఐఐఎం ఇండోర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్-2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 15, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 29న ప్రవేశ పరీక్ష జరగనుంది. దేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.