దిల్లీలో నకిలీ దివ్యాంగ ధృవపత్రాలతో నర్సరీ ప్రవేశాలు

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

దిల్లీలోని చాణక్యపురిలోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ ప్రవేశాల కోసం నకిలీ దివ్యాంగ ధృవపత్రాలను సమర్పించినట్లు ఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ధృవపత్రాలు నకిలీవని తేలడంతో భారతీయ సంహిత సెక్షన్ల కింద దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎన్ఐ తెలిపింది. నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.