నిర్మా యూనివర్సిటీలో విద్యార్థి కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్ ఉదంతం కలకలం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Ahmedabad

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిర్మా యూనివర్సిటీలో కామెడీ షో సందర్భంగా ఒక విద్యార్థి చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది. వేదికపై మాట్లాడిన విద్యార్థి కాలర్‌ను ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ అయిన ప్రొఫెసర్ పట్టుకుని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, ప్రొఫెసర్ విద్యార్థికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు యూనివర్సిటీ నిష్పాక్షిక విచారణ జరపాలని కోరారు.