గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అచ్చెన్నాయుడు
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వమని, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కలి మండలంలో రూ.2.20 కోట్ల వ్యయంతో పలు రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా విస్మరించబడ్డాయని ఆరోపిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.