తిరుమలలో అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి వాహన సేవలు

రిపోర్టర్: శివ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీవారి మహా రథోత్సవం ఘనంగా జరుగగా, రాత్రి కల్కి అవతారంలో మలయప్పస్వామి అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ వేడుకతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ముగియగా, బుధవారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు.