తీవ్ర తుఫాను ముప్పు: దక్షిణ కోస్తా రైల్వే యంత్రాంగం హైఅలర్ట్ జారీ
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే యంత్రాంగం అప్రమత్తమైందని జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జోన్ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసే ప్రత్యేక వార్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ట్రాక్‌లు, వంతెనలపై నిరంతర నిఘా ఉంచామని, అత్యవసర మరమ్మతుల కోసం సామగ్రిని సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు.