ఏషియన్ ఛాంపియన్స్ లీగ్: వియత్నాంక్లబ్ పై ఈస్ట్ బెంగాల్ ఘన విజయం

రిపోర్టర్: గోపి స్థలం: Kolkata

కోల్కతా వేదికగా జరిగిన ఏఎఫ్సీ మహిళల ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్ లో వియత్నాం ఛాంపియన్ హో చి మిన్ సిటీ జట్టుపై ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టు రెండుాఒకటి తేడాతో ఘన విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. ఉగాండా స్ట్రైకర్ ఫజిలా ఇక్వాపుట్ మొదటి అర్ధభాగంలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, కోచ్ ఆంథోనీ ఆండ్రూస్ వ్యూహం ఫలించిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.