భారీ జనసందోహం మధ్య ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన మహోత్సవం ప్రారంభమైంది. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి శోభాయాత్ర భక్తుల జయధ్వానాల నడుమ హుస్సేన్సాగర్ వైపు సాగుతోంది. క్రేన్లో తలెత్తిన టెక్నికల్ సమస్యల కారణంగా శోభాయాత్ర మూడు గంటలు ఆలస్యమైంది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. నిమజ్జన వేడుకల్లో అల్లకల్లోలం సృష్టిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు మాస్ వార్నింగ్ జారీ చేశారు.