గణేష్ నిమజ్జనం వేళ నగరంలో పాఠశాలలకు సాధారణ సెలవు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ ఊరేగింపులు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీఎస్ సంజయ్ జాజూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న పని దినంగా పాటిస్తారని స్పష్టం చేశారు.