మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్: వైఎస్సార్ కడప జిల్లాలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: వైఎస్సార్ కడప
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాతో పాటు పలు ప్రాంతాల్ లో వెలువడుతున్న ఫలితాల్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. కడప మేయర్ స్థానంతో పాటు మెజారిటీ వార్డులను కైవసం చేసుకునే దిశగా కూటమి అభ్యర్థులు అడుగులు వేస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.