ఆర్టీసీ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మం సంజీవరెడ్డి భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం ఖమ్మం బస్ డిపో వద్ద ఐఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ ఉంటుందని, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.