స్వనిధి క్రెడిట్ కార్డుల పంపిణీపై గోపాలకృష్ణ రాజు హర్షం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మలికిపురం
పిఎం స్వనిధి పథకం ద్వారా చిరువ్యాపారులకు పది నుంచి ముప్పై వేల రూపాయల వరకు క్రెడిట్ కార్డులు ఇవ్వడాన్ని లక్కవరం ఛాంబర్ అధ్యక్షులు రుద్రరాజు గోపాలకృష్ణ రాజు స్వాగతించారు. ప్రైవేటు వడ్డీల భారం నుంచి పేద వ్యాపారులకు ఉపశమనం కలిగేలా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని తోపుడుబళ్లు, కూరగాయల వ్యాపారులకు కూడా బ్యాంకుల ద్వారా ఈ కార్డులు త్వరితగతిన అందేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రత్యేకంగా కోరారు.