నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం లేదు: షర్మిల ధ్వజం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ఆస్తుల పంపకాల్ లో బెంగళూరులోని యలహంక ఆస్తి తనకు, పిల్లలకు పూర్తిగా దక్కిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని ఆమె సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లి వివాదరహితంగా జరగాలనే ఉద్దేశంతో యలహంక ఇంట్ లో కాకుండా వేరే ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.